#VADEVO_KANTIRATAREY_VANNELAVAADU #ANAND_BHATTAR #PRIYA_SISTERS_ANNAMAYYA_SONGS #ANNAMAYYA_AKSHARA_VEDAM #వాడివో_కంటిరటరే_వన్నెలవాడు
🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺
అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 84
( వాడివో..కంటిరటరే...వన్నెలవాడు..)
🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺🍃
ఓం నమో వేంకటేశాయ.🙏🙏
అందరికీ శుభ శనివారము
✍️ --- మీ వేణుగోపాల్ 🙏
అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 84 కి శుభ స్వాగతం
✍️ ..మీ వేణుగోపాల్.
శ్లోకము ః--🙏🙏
( శ్రీ వేంకటేశ్వర దివ్య మంగళ విగ్రహ వర్ణన ) 🙏🙏
🌹🌹
ఓం శిరసివజ్ర కిరీటం - వదనే శశివర్ణ ప్రకాశం
ఫాలే కస్తూరి శ్రీగంధ తిలకం -
కర్ణే వజ్ర కుండల శోభితం
నాసికాయాం సువాసిక పుష్పాదళం -
నయనే శశిమండల ప్రకాశం
కంఠేసువర్ణపుష్ప మాలాలంకృతం -
హృదయే శ్రీనివాస మందిరం
కరే కరుణాభయసాగరం , భుజే శంఖ చక్రగదాధరం
స్కంధే సువర్ణ యజ్ఞోపవీత భూషణం -
సర్వాంగే స్వర్ణపీతాంబరం ధరం
పాదే పరమానందరూపం - సర్వపాపనివారకం
సర్వం స్వర్ణమయం - నామ పావనం శ్రీ వేంకటేశం
శ్రీనివాసం - తిరుమలేశం - నమామి శ్రీ వేంకటేశం !!
🙏🙏🙏🙏🙏🙏🙏
అని అనాదిగా భక్తాగ్రేసరులు ఆర్యులు తలచి తలచి తరించిరి కదా !! 🙏
సామాన్య భక్తులమైన మనము యెన్నో వ్యయ ప్రయాసలకొనర్చి, సహ భక్తుల తోపులాటలతో అలసిపోతూ, భక్తి పారవశ్యముతో బంగారు వాకిలిలోకి అడుగుపెట్టి , స్వామిని చూద్దామని కనులు ఆయనపై వాలేలోపునే , ఆయన దాసులు గ్రక్కున పక్కకు లాగేస్తారు . ఇక మనకు స్వామి దివ్య మంగళ స్వరూపము కనులారా చూచి ఆనందించే భాగ్యమెక్కడిది . 🙏
మనలాంటి వారికోసమే అన్నమాచార్యుల వారు ఆనాడే , స్వామి దివ్యరూపమును , ఆసాంతము కన్నులకు కట్టినట్టు , వర్ణిస్తూ ,మనముదరే స్వామిని నిలిపారు చక్కటి సంకీర్తనలో . ఈ సంకీర్తన కనులు మూసుకుని తన్మయత్వముతో స్వామినే తలుచుకుంటూ పాడుకుంటే , ఆయన మన ముందే ఉన్నట్టు గోచరమగును .🙏
మరి ఆ చక్కటి సంకీర్తన అర్ధము తెలుసుకుని పాడుకుందామా ఈ వారము !!🙏🙏
🌹
ఇదిగో !! మీరు అందరూ చుసారా ఇతనిని !!
ఇతడే అనేక వైభవములతో ప్రకాశిస్తూ అలరారుతున్న మోహనరూపుడు !!
🌹🙏
🌹ఇతడే మేలిమి బంగారు పూతతో చేసిన పిడిలో , ఖడ్గమును ఉంచుకున్నవాడు . ( మన పాపకర్మలను ఛేధించు దివ్యమైన నందకము అనే ఖడ్గమది ). 🌹🙏
🌹ఇతడె శిరముపై ధగధగల మెరయుచునున్న పెద్ద కిరీటము గలవాడు .🌹🙏
🌹ఇతడే తనువెల్ల చక్కగా పసుపు పచ్చని బంగారు వర్ణ పట్టు వస్త్రములు కట్టుకుని అందముగా యున్నవాడు .🌹🙏
🌹ఇతడే తన వక్షస్థలమందు దేదీప్యమానముగా వెలుగుతున్న అరుదైన కౌస్తుభ మణిని అనుకూలముగా ధరించి
విలసిల్లుతున్నాడు !! 🌹🙏
🌹ఇతడే చక్కగా ముద్దుగొలిపే ముగ్ధ మనోహరమైన ముఖరూపు గలిగిన సుందర మూరితి !!🌹🙏
🌹ఇతడే తెల్లని ముత్యపు కాంతులీలుతున్న , తిరునామము ను తన నుదిటిపై అందముగా దిద్దుకున్నవాడు !!🌹🙏
🌹 అదిగో !! అదిగో !! అతడే మహిమాన్వితమైన శంఖమును , చక్రమును తన హస్తములతో పట్టుకుని , వైభవముగా నిలుచున్న వాడు !! 🌹🙏
🌹ఇదిగో ఇతడే తన హస్తమును తొడపై ఆన్చి నిబ్బరముగా నిలుచున్న వాడు !!🌹🙏
🌹ఇతడే తన హస్తమును అభముద్రగా చూపిస్తూ , అందరికీ ధైర్యమును కలుగుచేయుచున్నవాడు !!🌹🙏
🌹ఇతడే , అందియలు పాదములకు చక్కగా అమరగా ,ఘల్లుఘల్లుమని గజ్జెలు రవముల పాదాలవాడు!! 🌹🙏
🌹ఇతడే కనకపు చెవికమ్ములు మెరయచుండనుండగా
ధరించియున్నవాడు !! 🌹🙏
🌹ఇతడు ధృడమైన భుజములపై , నిండుగా కడియాలను అలంకరించుకున్నవాడు !!🌹🙏
🌹ఇతడే అతిమనోహర చిరు దరహాసముతో చల్లని చూపులు చూచుచున్నవాడు !!🌹🙏
🌹ఇతడే నాభి యందు కమలము ఉన్నవాడు !! 🌹🙏
🌹ఇతని మొలత్రాడు బంగారు వర్ణముతో , మణిపూసలతో మెరియుచున్నది !! 🌹🙏
🌹ఇతని ముఖారవిందము , లేత చిగురుటాకు వలే సదా ఆహ్లాదముగా యున్నది !!🌹🙏
🌹 చూడండి !! చూడండి !! ఇతడే శ్రీ వేంకటేశ్వరుడు!!
ఈతనికే తగిన అలమేలుమంగను మంగళసూత్రముగా తన మెడలో హృదయముపై నిరంతరమూ ఉంచుకున్న శ్రీ వేంకటేశ్వరుడు !!🌹🙏
🌹 ఇతడే !! ఇతడే !! శ్రీ వేంకటేశ్వరుడు !!
అందరూ ఇతనిని అతిశయముతో చుడండి !!🌹🙏
🌹 చూచి తరించండి !!🙏
ఓమ్ నమో అలమేలుమంగ వేంకటేశాయ !!🙏🙏
తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏
( అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 84 )
✍️ -- మీ వేణుగోపాల్
🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺🍃
🌹🌹 సంకీర్తన 🌹🌹👇
పల్లవి:
వాఁడివో కంటిరటరే వన్నెలవాఁడు
పైడి మోలము కటారు పరుజుల వాఁడు
చ.1:
పెద్ద కిరీటము వాడు , పీతాంబరము వాడు
వొద్దిక గౌస్తుభమణి వురము వాడు
ముద్దుల మొగమువాడు ముత్తేల నామమువాడు
అద్దిగో శంఖ చక్రాల హస్తాల వాడు
చ.2:
అందిన కటి హస్తము నభయ హస్తము వాడు
అందెల గజ్జల బాదాలమరు వాడు
కుందణంపు మకర కుండలంబుల వాడు
కందువ బాహుపురుల కడియాల వాడు
చ.3:
నగవు జూపుల వాడు నాభి కమలము వాడు
మొగపుల మొలనూళ్ళ మొలవాడు
చిగురు మోము వాఁడు శ్రీ వేంకటేశుడు
తగు నలమేలుమంగ తాళి మెడ వాడు
Негізгі бет vadevo kantiratarey
Пікірлер: 17