LYRICS & TUNE : Dr. AKUMARTHI DANIEL GARU
VOCALS : IMPACT MARY SOWRABHA
KEYS : DANIELRAJ YARLAGADDA & MADHU BABU CHEEKATLA
RYTHMS : KIRAN KUMAR MORAMPUDI
PERCUSSIONS : PAUL CHAITANYA (HONEY)
TABLA & DOLLAKS : SANTHOSH DAVULURI
BY IMPACT MINISTRIES, KAKINADA.
RECORDED @ IMPACT STUDIO, KAKINADA.
CONTACT US ON : 9849415733.
తప్పనిసరిగా చదవాల్సిన మెసేజ్
ఈ కరోణ వైరస్ కారణంగా....సంగీతం తో ముడి వేయబడిన మా జీవితాలలో.....ఎన్నో మార్పులు,మరి ఎన్నో కష్టాలు,ఇంకా ఎన్నో ఎదురుచూపులు....ఈ ఆరు నెలలుగా ఈ సంగీతకారుల మరియుు సౌండ్ సిస్టమ్ ఆపరేటర్ ల జీవితాలు అతలాకుతలమై....ఎవరినీ చేయి చాచి అర్ధించలేక...అందరినీ సంతోషపరిచే మరో పని చేతకాక...అవకాశం ఉన్నప్పుడల్లా సహాయం చేసే మేమే...సహాయం కోసం ఎదురు చూసే పరిస్థితికి ఈ కరోనా వైరస్ తీసుకొచ్చింది....దయచేసి ఈ మెసేజ్ చూస్తున్న మీలో ఎవరైనా సహాయం చేసే పరిస్థితులో ఉంటే....మీ దగ్గరలో ఉన్న, మీకు తెలిసిన,ఇంతకుముందు మీ గృహ కార్యక్రమాలకు,ఫంక్షన్ కు,మీటింగ్స్ కు మరియు సహవాస మహోత్సవాలకు పిలిపించుకున్న సంగీతకారులకు సహాయం చేయడానికి ప్రయత్నించండి...ఎందుకంటే ఈ సమయంలో సహాయం చేసిన మిమ్మలను....మా సంగీతకారులు ఎప్పటికీ మరిచిపోలేరు...నేను తప్పుగా మాట్లాడిన ఇట్లు మీ కనిపిస్తే నన్ను క్షమించండి....ఎందుకంటే ఎంతో మంది కళాకారులు పరిస్థితి...ఒక కళాకారుడిగా నాకు తెలుసు కాబట్టి...నేను ఈ విధంగా కళాకారుల అందరి తరుపున...ఈ సహాయం కోరుకుంటున్నాను...
మీకు తెలిసిన కళాకారుల అందరితో....ఫోన్ చేసి మాట్లాడడానికి ప్రయత్నించండి....ఈ ఆరు నెలలుగా వారి పరిస్థితిని ఆరా తీయండి....వారు కష్టాలలో ఉంటే తప్పనిసరిగా సహాయం చేయండి....
ఎందుకంటే...
ప్రభుత్వం మాకు సహాయం చేయదు...
ప్రతిపక్షం మా తరఫున మాట్లాడే ప్రయత్నం చేయదు
మీ సంతోషంలో మిమ్మల్ని అందరిని ఆనందపరిచటానికి మీతో ఉన్న మాకు....ఈ కష్ట కాలంలో.....చేయూతనందించి... కళాకారుల సంతోషానికి కారకులు కాగలరని ...
మీ డానియల్ రాజ్ యార్లగడ్డ...
9849415733.
If you inspired to contribute us...
Y. RAJU
SBI
A/C : 10599037513
KAKINADA MAIN BRANCH
IFSC : SBIN0000850.
PHONE PAY & G PAY : 984_941_5733.
IMPACT MINISTRIES
D.NO: 1-443 /2
NEAR GOVT WATER PLANT
RAYUDUPALEM, KAKINADA
EAST GODAVARI DISTRICT
ANDHRA PRADESH
PINCODE : 533005
వెండి బంగారాల కన్న మిన్న అయినది
యేసు ప్రేమ - నా యేసు ప్రేమ (2)
లోక జ్ఞానమునకు మించిన ప్రేమ (2)
లోకస్థులు ఎవ్వరు చూపలేని ప్రేమ (2) ||వెండి||
లోకమునకు వెలుగైన ప్రేమ
లోకమును వెలిగించిన ప్రేమ (2)
లోకులకై కరిగిపోయిన ప్రేమ
లోకాన్ని జయించిన ప్రేమ (2)
యేసు ప్రేమా - శాశ్వత ప్రేమా (2)
హల్లెలూయా మహదానందమే (2) ||వెండి||
ఏ స్థితికైనా చాలిన ప్రేమ
నీ పరిస్థితిని మార్చగల ప్రేమ (2)
నీకు బదులు మరణించిన ప్రేమ
చిర జీవము నీకొసగిన ప్రేమ (2)
యేసు ప్రేమా - శాశ్వత ప్రేమా (2)
హల్లెలూయా మహదానందమే (2) ||వెండి||
Негізгі бет వెండి బంగారాల కన్న మిన్న అయినది|SOWRABHA FOR CHRIST|IMPACT MINISTRIES|AKUMARTHI DANIEL|PRADHAMA RAO|
Пікірлер: 142