18 పురాణాలలో ఏముంది?
“వేదం ప్రభు సమ్మితం
పురాణం సుహృత్ సమ్మితం
కావ్యం కాంతా సమ్మితం”
అన్నది పెద్దలు చెప్పిన మాట. వేదం ప్రభుసమ్మితం అంటే వేదం ప్రభువు వంటిది. అంటే మనల్ని ధర్మమార్గంలో నడవమని యజమానిలా శాసిస్తుంది. ఉదాహరణకు “సత్యం వద - ధర్మం చర” అన్నది వేదవాక్కు. అంటే నువ్వు సత్యాన్నే పలకాలి. ధర్మాన్నే ఆచరించాలి అని రెండు ముక్కల్లో శాసనంలా చెప్పి ఆజ్ఞాపిస్తుంది. ఇక కావ్యం కాంతా సమ్మితం. కావ్యం మనసెరిగిన కాంతలా మన మనసుని రంజింపజేస్తూనే మనల్ని ధర్మం వైపు నడిపిస్తుంది. ఉదాహరణకు రామాయణ మహాకావ్యంలో నేరుగా మనకేమీ ఉపదేశాలుండవు. కానీ భార్యాభర్తల మధ్య అనురాగం ఎలా ఉండాలో, అన్నదమ్ముల మధ్య ప్రేమ ఎలా ఉండాలో, ఎటువంటి ఆలోచనా ధోరణి మనల్ని ఆపదల పాలు చేస్తుందో, ఎంత కష్టం వచ్చినా ధర్మం తప్పకుండా ఎలా నిలబడాలో ఇలా ఎన్నో విషయాలు మనకు ఆ కావ్య పఠనం ద్వారా అవగతమవుతాయి. ఇక సుహృత్ సమ్మితాలైన పురాణాలు మన మంచి కోరుకునే స్నేహితుల వంటివి. ఈ పురాణాలు గతంలో జరిగిన అనేక కథలు, గాథలూ, సుభాషితాలూ చెప్పి స్నేహితుల్లా మనల్ని ధర్మమార్గంలో నడిపిస్తాయి. నిజానికి ఈ పురాణాల ద్వారా మనం వేదం చెప్పదలచుకున్న విషయాలను మరింత స్పష్టంగా అర్థం చేసుకుని, అచరించే అవకాశం కలుగుతుంది. పురాణేతిహాసాలవల్ల వల్ల మూడు రకాల లాభాలున్నాయంటారు కంచి పరమాచార్యులవారు. అవి
పురాణాలలో చెప్పబడినటువంటి ఆ పూర్వానుభవాలు మనకు పాఠాలై ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కోవడానికి ఉపకరిస్తాయి.
మంచి ప్రవర్తన వల్ల సత్ఫలితాలను పొందిన మహనీయుల జీవితాల అధ్యయనం మనకు మార్గదర్శకమవుతుంది.
దుష్టకార్యాలు చేసి నశించిపోయిన వారి జీవితాలు మనం పెడదారి పట్టకుండా కాపాడతాయి. ఇవీ పురాణ శ్రవణం వలన కలిగే లాభాలు. ఇక..
“పురా అపి నవం పురాణం” అని యాస్క నిరుక్తమ్ చెబుతుంది. అంటే ఈ పురాణాలు పాత గాథలనే చెబుతూ నిత్యనూతనంగా భాసించేవన్న మాట. పురాణంలో చెప్పబడిన కథలు, విషయాల ద్వారా ఇప్పటి తరాలకూ, రేపటి తరాలకూ కూడా ప్రయోజనం కలుగుతూనే ఉంటుంది. అందుకే ఇవి పాతబడిపోవడం అంటూ ఉండదు. ఎంత పాతవో అంత కొత్తవి అన్న మాట. ఈ పురాణాలు ప్రధానంగా పద్దెనిమిది ఉన్నాయి. వీటిని మహాపురాణాలంటారు. ఇవి కాక ఇంక ఉప పురాణాలు కూడా చాలా ఉన్నాయి. ఈరోజు మనం ఈ పద్దెనిమిది మహాపురాణాల కోసం చెప్పుకుందాం. ఈ పురాణాలన్నింటికీ కర్త వేదవ్యాస భగవానుడు. అయితే ఈ పురాణాలను మొదటిగా ప్రవచనం చేసింది మాత్రం సూత మహర్షి. ఈ సూత మహర్షి నైమిశారణ్యంలో ఈ పురాణాలను చెబుతూ ఉండగా విన్నవారు శౌనకాది మహర్షులు.
ఇక మనం ఒక్కో పురాణంలో ఏముందో సంగ్రహంగా తెలుసుకుందాం. మొదటి పురాణం..
Rajan PTSK
#RajanPTSK #Puranas #TeluguStories #Ajagava
Негізгі бет 18 పురాణాలలో ఏముంది? | 18 puranas in Telugu | Rajan PTSK | Ajagava
Пікірлер: 182