మగువ ఉనికి అపూర్వం: మగువ మనసు నవనీతం: మగువ ప్రేమ నిష్కల్మషం:
Poetry Contribution - Uma Bharathi - Ramayanam Prasadarao - Sharada Polamraju - Msv Gangaraju
మగువ మనసు - Msv గంగరాజు
పూలరేకు మాత్రమే కాదు;
పచ్చల పిడి బాకు కూడా!
కలకంఠ కలస్వనమే కాదు;
కంఠీరవ ఘన గర్జన కూడా!
లలిత హల్లీసకమే కాదు;
ప్రళయ తాండవం కూడా!
అఫాంగ వీక్షణమే కాదు;
జ్వాలా భీల మహోగ్ర తీక్షణం కూడా!
..
నేనెవరిని - ఉమా భారతి
నేనేమన్నా పూవ్వునా రాలిపోడానికి?
నేనేమన్నా పక్షినా ఎగిరిపోడానికి? నేనేమన్నా రాయినా విసిరేయబడ్డానికి?
నేనో మనసున్న మగువను --మనోబలం ఉన్న వనితను
నేను పట్టిన చేయి విడువను --నమ్మిన సిద్ధాంతమ్ నుండి తొలగను
కష్టంగా ఉందని వెను తిరగను --ఇష్టం పోయిందని వొదిలేయను
ఇక ఈదలేను అనను --నావల్లవుతుంది అని ముందుకు సాగుతాను
చూద్దాం... చేద్దాం... సాదిద్దాం అనుకుంటాను'
మగనితో బాధ్యతలని పంచుకోగలను -- బిడ్డలకి బతుకు పాఠాలు నేర్పగలను
***సమాజ శ్రేయస్సు ఆదర్శంగా -- జాతి ఉన్నతే ఆశయంగా ముందుకు సాగుతాను
నేను ‘ధీర’ ను .... అని గొంతెత్తి చాటుతుందామె. అది ఆమెలోని స్థితిస్థాపకత.
..
ఉవిద - రామాయణం ప్రసాదరావు
ఉవిద... వివిధ రూపాల కుముద
వైవిధ్య అవతారాల ఉగ్మలీ ……పుట్టుకతోనే పరిమళిస్తుందామె బుద్ధి
ఎలనాగకి ... సహనం తోబుట్టువేమో --ఓరిమి సహజాత ఏమో
ఎన్ని కష్టాలు నిష్టురాలు ఎదురైనా --అడ్డు పెట్టుకుంటుంది తన సహనాన్ని
మనసు లేని మనువుని -- ఇష్టం లేని కలయికని ఇచ్చగించదామె
అష్టోత్తర శత నామాలు ఆమెవి
-చెల్లి,అక్క, సతి - అమ్మ, కోడలు - అత్త,అవ్వ - ***అన్నింటా ఆమె నిర్వహణ కూడా అనితరం!
..
నేటి తరం మహిళ - శారద పోలంరాజు
ఆడదంటే అబల కాదు .. ఆదిపరాశక్తి
వేదంలొ లోపాముద్రలం…గణితశాస్త్రంలో ….శకుంతలలం
చట్టంలో కిరణ్ బేడీలం…న్యాయానికి ఫాతిమాలం
వీరత్వమే ఝాన్సీ …రాజకీయమే ఇందిరమ్మ…రౌద్రమే రుద్రమ్మ గానమే లత
స్త్రీ విద్యకంకితమన్నది దుర్గమ్మ…రోదసీని జయించానన్నది సునీత
ఆకాశంలో సగభాగమన్నది కల్పన.. సమాజసేవన్నది మేధా
ఆవకాయ నుండి అంతరిక్షం దాకా…అడవుల నుండి అమెరికా దాక
అవధరించని విద్యలేదు…అధిగమించని మెట్టులేదు
ఆడదంటే మనసున్న మనిషి…కాలికింద తొక్కటానికి అడుసుకాదు
తలమీద ఎక్కటానికి కిరీటం కాదు…సంసార రధానికి మరో చక్రం
Негізгі бет "అంతా 'ఆమె' మయం" (స్త్రీత్వం, స్త్రీ తత్వం) Concept & Narration-'Natyabharathi' Uma Bharathi
Пікірлер: 3