ఉమ్మడి విశాఖ (Visakhapatnam) మన్యంలో అరకు కాఫీ (Araku Coffee) అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ప్రపంచవ్యాప్తంగా అరకు కాఫీ మంచి పేరు దక్కించుకుంది. ఇక్కడ గిరిజనులు సేంద్రియ పద్ధతుల్లో కాఫీని పండిస్తుంటారు. పోడు వ్యవసాయం ఎక్కువగా ఉండడంతో గిరిజన ప్రజలందరూ కూడా కాఫీ చెట్లు వేసి పండించి కాఫీ పొడి తయారు చేస్తూ ఉంటారు. అరకు, లంబసింగి చూసుకున్నట్లయితే అతి శీతల ప్రదేశం గాను ఆంధ్ర ఊటీ గాను మంచి పేరు ఉంది. ఇక్కడ ఇలా చల్లగా ఉండడానికి కారణం సముద్ర మట్టానికి 3,600 అడుగుల ఎత్తులో ఉండే విశాఖ ఏజెన్సీ ఎప్పుడు చల్లగా వుంటుంది. ఇక్కడ కాఫీ తోటల పెంపకానికి అనువైన కింద ప్రాంత ప్రదేశం. ఇక్కడి చల్లని వాతావరణం వుండటం తో ఇతర పంటలు కంటే ఎక్కువగా కాఫీ తోటల సాగుకి అనుకూలంగా ఉంటుంది. కాఫీ తోటలు ఎదిగి పంట దశకు చేరుకునే ముందు కాఫీ గింజలు పచ్చగా ఉండడం జరుగుతుంది. పచ్చగా ఉండే సమయంలో గింజలను ఎలా ఉంటాయనేది బయట వారికి పెద్దగా తెలియదు. ఈ ఏజెన్సీలోని గిరిజన ప్రజలందరూ కూడా కాఫీ పంట పైన ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారు. సీజనల్గా వచ్చే పంటలు కాఫీ మిరియాలు పనస పళ్ళు పైనాపిల్ ఇలా పంటలు పండిస్తూ జీవనాధారానికి ఆర్థికంగాను ఇవి పని చేస్తాయి. ఈ హరి కి కాఫీ అనేది కొత్తగా వచ్చింది కాదు. వందేళ్ల కిందట నుంచే విశాఖ ఏజెన్సీలోని పండించడం జరిగింది. మొదటగా ఆంగ్లేయులు కొన్ని ప్రాంతాల్లో ఈ పెంపకాలు మొదలుపెట్టారు. అరకు, అనంతగిరి, జీకే వీధి, చింతపల్లి, పెదబయలు, ఆర్వీనగర్, మినుమలూరు, సుంకరమెట్ట ఈ ప్రాంతాల్లో వందల కిందటే కాఫీ పంటలు ఆంగ్లేయులు బాగా పండించడం జరిగింది.
బ్రిటిష్ ను మొదలుపెట్టిన కాఫీ పంట గిరిజన కోపరేటివ్ కార్పోరేషన్ ఏర్పడిన తర్వాత 1960 గిరిజనులకు మంచి ఆదాయం వచ్చే విధంగా ఇది తోడ్పడుతూ ఇక్కడ వాణిజ్యపరమైన కాఫీ తోటల పెంపకం వైపు గిరిజనులు వెళ్లే విధంగా ప్రోత్సాహం అందించింది. మొదట్లో తక్కువగా కాఫీ పంటలు పండించేవారు. పది వేల ఎకరాల్లో ప్రారంభమైన కాఫీ తోటలు ఇప్పుడు 1.5 లక్షల ఎకరాల వరకు కాఫీ పంటలు వేస్తున్నారు.
Негізгі бет Araku coffee plantation..అరకు కాఫీ తోటలు!! ARAKU VALLEY 2024
Пікірлер