Making of Ganuga Oil in Commercial way by NRI
3 Ganuga Oil units in one place || "Ganuga" Making Comeback
Cold-pressed oils are gaining huge popularity nowadays with people realizing their benefits over refined ones so is the process of making these wooden oil mills operated by a pair of bullocks.
The increasing demand for cold-pressed edible oils has brought good demand for making of wooden oil mills (called Ganuga in Telugu) and individual farmers and large NGOs are taking to this form of producing groundnut, coconut, sesame oil. Many software professionals too are getting into natural farming and using this as a value addition to their produce.
Mr. Sunil Kumar Vasireddy has Installed 3 such oil mills in one place at Seethampet Village, Khammam district, Telangana State. He says people have realized that such oil extraction process retains healthy antioxidants that are otherwise damaged by being exposed to excessive heat due to higher rotations of machines.
He installed an oil mill that takes 12 kg of groundnut in batch and extracts oil in 2.5 to 3 hours. Oil yields 5kg/12kg of seeds. ( Sesame 5kg, Coconut 6Kg oil ). Presently He is selling Sesame Oil Rs. 650/1ltr, Groundnut oil Rs. 450/Ltr and Coconut Oil are Rs 600/Ltr. and also He is planing to Produce Organic Inputs for Agriculture.
వ్యాపారసరళిలో కట్టె గానుగ నూనెల ఉత్పత్తిలో ఎన్.ఆర్.ఐ. సహజసిద్ధమైన గానుగ నూనెలతో అనేక ప్రయోజనాలు.
కనుమరుగవుతున్న సంప్రదాయ ఆహారపు అలవాట్లను గుర్తుచేస్తూ... ఆరోగ్యాన్ని పెంపొందించే గానుగ నూనెల యూనిట్ లను చిన్న తరహా కుటీరీ పరిశ్రమగా వ్యాపారసరళిలో విస్తరించి, అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తున్నారు వాసిరెడ్డి అనిల్ కుమార్. ఇటీవల అమెరికా నుండి ఇండియాకు తిరిగి వచ్చిన ఈ ఎన్.ఆర్.ఐ కు వ్యవసాయం అంటే అమితమైన ప్రీతి. రసాయనాలతో, పురుగు మందుల అవశేషాలతో మానవాళి ఆరోగ్యానికి పెను విపత్తుగా పరిణమించిన నేటి వ్యవసాయ ఉత్పత్తులను గమనించిన ఈయన, ఆర్గానిక్ వ్యవసాయం దిశగా ముందడుగు వేస్తున్నారు. ఖమ్మం రూరల్ మండలం నివాసం వుంటున్న ఈయన, చింతకాని మండలం, సీతంపేట గ్రామంలో భూమిని కొనుగోలుచేసి, మొదటగా ప్రజలకు నిత్యావసరమైన నూనెలను సంప్రదాయ పద్ధతిలో కట్టె గానుగల ద్వారా ఉత్పత్తి చేసేందుకు శ్రీకారం చుట్టారు. సంప్రదాయబద్ధంగా ఎడ్లు, ఆవులను ఉపయోగించి ఈ నూనెలు తీస్తున్నారు. ఇందుకు అవసరమైన ఉత్పత్తిని, సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన రైతుల వద్ద నుండి కొనుగోలుచేస్తున్నారు. నూనెలే కాకుండా ప్రకృతి వ్యవసాయంలో పంటలకు అవసరమైన పోషకాలను కూడా తయారుచేసేందుకు నడుం బిగించారు.
ఈయన ఫామ్ లో ప్రస్థుతం 3 గానుగలు వున్నాయి. ఒక్కో గానుగ నుండి రోజుకు 3 బ్యాచ్ లలో నూనె తీస్తున్నారు. 12 కిలోల నూనె గింజలకు, నువ్వులు, వేరుశనగ అయితే 5కిలోలు, కొబ్బరి అయితే 6 కిలోల చొప్పున నూనె వస్తోంది. ఎడ్లతో తిప్పటం, ప్రతి గానుగకు ఇద్దరు మనుషుల అవసరం వుండటంతో ఖర్చు ఎక్కువ అవుతోందని, 3గానుగల నుండి రోజుకు 60 కిలోల నూనె ఉత్పత్తి చేయగలుగుతున్నామని సునీల్ కుమార్ తెలిపారు. అవసరమైన వారికి ఆర్డరుపై నూనెలను స్వయంగా మార్కెట్ చేస్తున్నారు. వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
#karshakamitra #ganugaoils #coldpressedoils #bulldrivenoil
Facebook : mtouch.faceboo...
Негізгі бет Ойын-сауық కట్టె గానుగ నూనెలతో ఆరోగ్యం భేష్ || ఎడ్ల సహాయంతో గానుగ నూనె ఉత్పత్తి చేస్తున్న NRI || Karshaka Mitra
Пікірлер: 151