#mutyala harathi#vengamamba#lordvenkateshwara#mutyala harathi vengamamba#tarigonda vengamamba
తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతి
రాగం : ఆరభి తాళం : ఆది తాళం ఖండగతి శృతి : 5 ½ ( G Sharp )
1. శ్రీ పన్నగాద్రి వర శిఖరాగ్రవాసునకు
పాపాంధకార ఘన భాస్కరునకూ
ఆ పరాత్మునకు నిత్యానపాయినియైన
మా పాలి అలమేలుమంగమ్మకూ ||
జయ మంగళం నిత్య శుభమంగళం
జయ మంగళం నిత్య శుభమంగళం
2. శరణన్న దాసులకు వరమిత్తునని బిరుదు
ధరియించియున్నపరదైవమునకూ
మరువ వలదీ బిరుదు నిరతమని పతిని
ఏమరనీయనలమేలు మంగమ్మకూ ||
జయ మంగళం నిత్య శుభమంగళం
జయ మంగళం నిత్య శుభమంగళం
3. ఆనంద నిలయమందనిశంబు వసియించి
దీనులను రక్షించు దేవునకునూ
కానుకల నొనగూర్చి ఘనముగా విభుని
సన్మానించు అలమేలు మంగమ్మకూ ||
జయ మంగళం నిత్య శుభమంగళం
జయ మంగళం నిత్య శుభమంగళం
4. పరమొసగ నా వంతు నరులకని వైకుంఠ
- మరచేత చూపు జగదాత్మునకునూ
సిరులొసగ తన వంతు సిద్ధమని నాయకుని
ఉరముపై కొలువున్న శరధిసుతకూ ||
జయ మంగళం నిత్య శుభమంగళం
జయ మంగళం నిత్య శుభమంగళం
5. తెలివితో ముడుపులిటు తెమ్ము తెమ్మని
పరుష నళికించి గైకొనెడి అచ్యుతునకూ
ఎలమి పాకంబు జేయించి అందరకన్న
- మలయకెపుడొసగె మహామాతకూ ||
జయ మంగళం నిత్య శుభమంగళం
జయ మంగళం నిత్య శుభమంగళం
6. మరియు చిత్రవిచిత్ర మంటపావళులకును
తిరువీధులకు దివ్య తీర్ఠములకూ
పరగ ఘనగోపుర ప్రాకారతతులకును
చిరములైతగు కనక శిఖరములకూ ||
7. తరచైన ధర్మసత్రములకును ఫలపుష్ప
భరిత శృంగార వన పంక్తులకునూ
మురువొప్పు ఉగ్రాణములకు బొక్కసములకు
సరసంబులగు పాకశాలలకునూ ||
8. అహి వైరి ముఖ్యవాహనములకు గొడుగులకు
రహినొప్పు మకర తోరణములకునూ
బహు విధ ధ్వజములకు పటు వాద్య వితతులకు
విహిత సత్కళ్యాణ వేదికలకూ ||
జయ మంగళం నిత్య శుభమంగళం
జయ మంగళం నిత్య శుభమంగళం
9. ధర చక్ర ముఖ్య సాధనములకు మణి
మయాభరణ దివ్యాంబర ప్రతతులకునూ
కరచరణ ముఖ్యాంగ గణసహితమై
శుభాకరమైన దివ్య మంగళ మూర్తికీ ||
జయ మంగళం నిత్య శుభమంగళం
జయ మంగళం నిత్య శుభమంగళం
10. కలిత సుఙ్ఞానాది కళ్యాణ గుణములకు
బలమొప్పునమిత ప్రభావమునకూ
వలగొనిన సకలపరివారదేవతలకును
చెలగి పనులొనరించు సేవకులకూ ||
జయ మంగళం నిత్య శుభమంగళం
జయ మంగళం నిత్య శుభమంగళం
11.అలరగా బ్రహ్మోత్సవాదులై సంతతము
వలనొప్పు నిత్యోత్సవంబులకునూ
పొలుపొందు విశ్వప్రభుత్వ మూలంబునకు
నలువొందు వర విమానంబులకునూ ||
జయ మంగళం నిత్య శుభమంగళం
జయ మంగళం నిత్య శుభమంగళం
12. అరయ తరిగొండ నరహరియగుచు నందరికి
వరములొసగే శ్రీనివాసునకునూ
మురియుచును విశ్వతోముఖునిట్లు భరియించి
సిరుల వెలయుచునుండు శేషాద్రికీ ||
జయ మంగళం నిత్య శుభమంగళం
జయ మంగళం నిత్య శుభమంగళం
Learn Here MUTHYALA HARATHI | VENGAMAMBA| LORD VENKATESWARA
► Click Here To • Learn Here MUTHYALA HA...
* Details *
Singer: Geethanjali
Enjoy and stay connected with us!!
►Subscribe us on KZitem: / @sangeethasadhananjali
Негізгі бет Learn Here MUTHYALA HARATHI | VENGAMAMBA| LORD VENKATESWARA
Пікірлер: 149