Maroju Veeranna Full Song | Madhupriya Songs | Burra Sathish | Kalyan keys | Latest Folk Songs 2023
#MarojuVeeranna #LatestFolkSongs #madhupriyasongs #onemediaet
Lyrics: Burra Sathish 9908906724
Singer: Madhu Priya
Music: Kalyan Keys
Dop: Kamli Patel
Editing: Hari Thota
D.I : Anneboina Srinivas
Direction: Anthadupula Nagaraju
Label & Channel Managed by: One Media - 7799090708
Branding & For Promotions Mail Us: Info@onemediaet.com
© All Rights Reserved: Burra Sathish ( One Media Et Private Limited )
బహుజన సిద్ధాంతపు యుద్దానివి నువ్వో
అన్నా మారోజు
పీడిత బతుకులకు అద్దానివి నువ్వో
నిను మరువము ఏ రోజు
కులవృత్తుల పూ దండవు
మా లాల్ నీలు జెండవు
పోరాట దారివన్న ...పొలికేకవే వీరన్న
1) సాయుధ పోరాట ఖిల్లా నల్లగొండ జిల్లాలోన
కర్విరాల కొత్తగూడెం ఎత్తిన పిడికిలివన్నా
సూరమ్మ రామలింగం ఆదర్శ దంపతులకు
వీరుడివై పుట్టినావు విప్లవమై పెరిగినావు
-గర్జించిన గళమా ప్రశ్నించేటి తత్వం
నిరుపేదల బలమా కోరావు సమానత్వం
పొడిసేటి ఎర్ర పొద్దువు పోరాట గోరు ముద్దవు
"బహుజన"
2) సామాజిక న్యాయం కై సకల దారులెతికినవు
కులనిర్మూలన కోసం నిత్యం కొట్లాడినవు
సభలెన్నో పెట్టినవు సంఘాలను కట్టినవు
దళిత బహుజన బిడ్డల వెన్నుతట్టి నడిపినవు
-కుమ్మరోల్ల కుండవు మా సాకలోళ్ళ బండవు
మాదిగోళ్ల డప్పువు నువ్ మర్లవడ్డ నిప్పువు
గొల్ల కురుమ గొంగడివి
ఉద్యమాల సింగిడివి
"బహుజన"
3) అంబేద్కర్ పూలేల ఆశయ స్వరమైనావు
ఆదివాసీ గిరిజన తండాలకు వరమైనావు
తెగింపు తో నినదించిన తెలంగాణ జంగువు
పల్లె పల్లెను మేల్కొలిపిన మా పాటల పొంగువు
-కమ్మరోల్ల సుత్తివి మా గౌడన్నల కత్తివి
నేతన్నల మగ్గమా దోపిడికి ఉరి పగ్గమ
-నీ జీవితమొక సమరం కామ్రేడా నువు అమరం
"బహుజన"
Негізгі бет Музыка Maroju Veeranna Full Song | Madhupriya Songs | Burra Sathish | Kalyan keys | Latest Folk Songs 2023
Пікірлер: 225