స్వాగతం.. నమస్కారం.. నా పేరు లోక్ నాధ్.
ఎంతో రుచికరంగా ఉంటాయి నెల్లూరులోని విఘ్నేష్ అల్పాహార శాలలో లభించు వంటకాలు.శాల నిర్వాహకులు విజయమ్మ గారు ఇంటి తరహాలో శుచి-రుచితో కోడి కూర, పాయతో పాటు అనేక మాంసాహార వంటకాలను నాణ్యతతో వండి ఆత్మీయంగా వడ్డిస్తారు.
ఇక్కడ లభించు
కోడి కూర గుజ్జుతో గుత్తంగా ఉంటుంది.అల్పాహారం లో మిళితం చేసుకునేందుకు వీలుగా విసుమంత పలుచగా పులుసుతో కూడి ఉంటుంది.ముక్కలు కరకరలాడుతూ పోటేలు కూరను తలపిస్తుంది.తయారీలో కారం,మసాలా పరిధి మధ్యస్థంగా వినియోగించిన రీత్యా మంట పుట్టే కారం మరియు ఘాటు అనిపించదు కూర.
కాస్త మందంగా మెత్తగా మలిచిన దోసెకు కోడికూరను జోడించి అలా నోటికి అందిస్తే అమోఘమైన రుచి,పాయతో పసందైన రుచి సంపుష్ఠి గా లభిస్తుంది.ఆహార సద్గుణంతో వకటి, రెండు దోసెలతో తినడం ముగించారు.కనీసం ఐదు దోసెలైన సునాయాసంగా తినేస్తారు.సంతృప్తి వ్యక్తం చేస్తారు.
ఇచ్చట ఓసారి ఆస్వాధిస్తే ఎప్పటికీ ఓ జ్ఞప్తిగా ఉంటుంది ఆరగింపు.
అల్పాహార శాల గూగుల్ లింక్:- 14°25'51.1"N 79°58'40.1"E
goo.gl/maps/7SgFsrzkPXjb34pPA
Негізгі бет Nellore Famous Kodi kura | Mutton Paya | Chiken Curry | Early Morning Tiffin | Nellore | Food Book
Пікірлер: 125