కాలానుగుణంగా భారతీయ పాక శాస్త్రానికి ప్రాశ్చాత్య నవ్యత మిళితం అవుతున్న నేపథ్యంలో
కాలక్రమంలో అలనాటి వంటలైన రాగి సంగటి,జొన్న సంగటి,కొరన్నం, జొన్నన్నం,జొన్నరొట్టె ఇలా మరెన్నో బలవర్ధకమైన,ఆరోగ్యానికిమేలైన ఆహారాలు కనుమరుగు అవుతున్నాయు.
ఆయా వంటకాల జన్మస్థలాల్లో మాత్రం నేటికి విశేష ఆదరణ లభిస్తుంది.అందుకు ఉదాహారణే రాయలసీమ రాగి ముద్ద..
రాగి ముద్దగా రాయలసీమ వాసులు పిలిచే రాగి సంగటిని సీమ పల్లెల్లో, పట్టణాల్లో ఇప్పుటికీ రోజు వారి ఆహారంగా తీసుకునే వారు అత్యధికులు.తమ ప్రాంతానికి వచ్చిన మిత్రులకు సైతం రాగి ముద్ద, నాటుకోడి కూర తొలుత గా వడ్డించి రాయలసీమ ప్రాచీన వంటకం యొక్క గొప్పదనాన్ని వివరిస్తూ ఆత్మీయత చాటుతారు.
అల్పాహార,భోజన శాలలో వలే రాయలసీమలో ఎక్కడ చూసిన రాగి ముద్ద ఆహార శాలు తరుసుపడతాయు.సీమ సోదరులకు ఈ ప్రాచీన వంటకం పట్ల ఎంతో మక్కువ కనుక.
ఆరోగ్యానికి మేలు చేస్తూ,రాయలసీమ కు వంటల పరంగా ప్రపంచ స్థాయి లో గుర్తింపు తెచ్చిన రాగి ముద్ద గూర్చి కార్యక్రమం చేయాలనుకున్న తరుణంలో అనంతపురం లోనే గడియార స్తంభం వద్ద గల ప్రసిద్ధి చెందిన నరసయ్య గారి ఆహారాశాలను ఎంచుకున్నాను. మారుతి హోటల్ పేరిట ఉన్న ఈ ఆహార శాల నరసయ్యగారి హోటల్ గా అనంతపురం వాసులకు సుపరిచితం.
అనంతపురం సమీపాన గల ఓ గ్రామం నరసయ్య గారిది వంటల తయారీలో నైపుణ్యం గల వారు. 42 ఏళ్ల క్రితం జీవనోపాధికై అనంతపురం వచ్చి ఆహారశాలను ప్రారంభించి రుచి, శుచితో కూడిన ఆహార పదార్థాలను తక్కువ ధరకే అందిస్తూ మంచి పేరు గడించారు.వారి తదుపరి ఆహార శాల బాధ్యతలు స్వీకరించిన వారి సోదరుడు ఆంజనేయులు గారు తమ అన్న బాటలో పయనిస్తూ అదే తరహాలో వండి వడ్డిస్తూ అనంతపురం వాసుల నుండి విశేష ఆదరణ పొందుతున్నారు.
ఆంజనేయులు గారు,వారి సహా ధర్మచారిని గారు వంటలు తయారీ చేస్తుండగా వారి కుమారుడు లోకేష్ గారు నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు.
ఇక్కడ రాగి ముద్ద, తలకూర,భోజనం తిన్న నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నాను.ఇంత మంచి ఆహార శాలను నాకు పరిచయం చేసిన మా అన్న రవీంద్ర నాధ్ రెడ్డి గారికి ధన్యవాదాలు.
#Anantapur
#Ragimuddanatukodikura
#Foodbook
#Food Book
#ragi sangati
#Rayalaseema
#rayalaseema ragi sangati
#rayalaseema famous food
#Anantapur
#anantapuram
#anantapuramfamousfood
#anantapurameggdosa
#shekareggdosa
#rayalaseemafoods
#rayalaseemaeggdos
#oliga
#anantapuramstreetfood,
#gunturfamousfoods
#anamthapuram oliga
#rayalaseema special Food
#anamthapuram famous uggani bajji
#traditional food recipes
#ragi sangati in telugu
#ragi sangati combination curries
#natukodi kura
Негізгі бет Anantapuram Famous Ragi Sangati | Goat Head Curry | Rayalaseema Special Traditional Food | Food BooK
Пікірлер: 225