మెంతికూర పులావ్ | Methi Pulao | Methi Rice | Authentic Methi Pulao Recipe @HomeCookingTelugu
మెంతికూరతో చాలా రుచికరమైన పులావును ఎలా చేయాలో ఈ వీడియోలో చూడచ్చు. దీన్ని ఉల్లిపాయ రైతాతో కలిపి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ ఆరోగ్యకరమైన రెసిపీని ట్రై చేసి ఎంజాయ్ చేయండి.
#methipulao #homecookingtelugu #menthikurapulao #homecooking #hemasubramanian
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
www.amazon.in/...
Here's the link to this recipe in English: bit.ly/2By8Lhg
తయారుచేయడానికి: 10 నిమిషాలు
వండటానికి: 30 నిమిషాలు
సెర్వింగులు: 2
కావలసిన పదార్థాలు:
నెయ్యి - 2 టీస్పూన్లు (Buy: amzn.to/2RBvKxw)
నూనె - 1 టేబుల్స్పూన్లు (Buy: amzn.to/2RGYvrw)
దాల్చిన చెక్క (Buy: amzn.to/31893UW)
లవంగాలు (Buy: amzn.to/36yD4ht)
యాలకులు (Buy: amzn.to/2U5Xxrn)
అనాస పువ్వు (Buy: amzn.to/37JQNnl)
బిర్యానీ ఆకులు (Buy: amzn.to/31cpSxL)
ఉల్లిపాయలు - 2 (తరిగినవి)
వెల్లుల్లి రెబ్బలు - 4
అల్లం ముక్కలు - 2
పచ్చిమిరపకాయలు - 2
టొమాటో - 1 (తరిగినది)
మెంతికూర కట్ట ఆకులు - 1 మీడియం సైజు
ఉప్పు - 1 టీస్పూన్ (Buy: amzn.to/2vg124l)
కారం - 2 టీస్పూన్లు (Buy: amzn.to/3b4yHyg)
బాస్మతి బియ్యం - 1 కప్పు (Buy: amzn.to/2RD40bC)
పుదీనా ఆకులు
నీళ్లు - 1 3/4 కప్పులు
తయారుచేసే విధానం:
ఒక ప్రెషర్ కుక్కరులో నెయ్యి, నూనె వేసి, మసాలా దినుసులు, ఉల్లిపాయలు వేసి వేయించాలి
ఒక మిక్సీలో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు వేసి పేస్టు చేయాలి
ఉల్లిపాయలు రంగు మారిన తరువాత రుబ్బుకున్న పేస్టు వేసి వేయించాలి
ఇప్పుడు టొమాటోలు వేసి, ఇవి బాగా మగ్గిన తరువాత శుభ్రంగా కడిగిన మెంతి ఆకులని వేసి వేయించాలి
తరువాత ఉప్పు, కారం వేసి రెండు మూడు నిమిషాలు వేయించిన తరువాత కడిగిన బాస్మతి బియ్యం వేసి, నీళ్లు పోసుకోవాలి
పొయ్యిని మీడియం ఫ్లేములో ఉంచి పులావును రెండు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించాలి
తరువాత పొయ్యి కట్టేసి, మూత తెరవకుండా, విజిల్ తీయకుండా పులావుని ఒక ఐదు-పది నిమిషాలపాటు మగ్గనివ్వాలి
అంతే, చాలా రుచికరమైన మెంతికూర పులావుని రైతాతో కానీ, మీకు నచ్చిన గ్రేవీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది
You can buy our book and classes on www.21frames.in...
HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES
WEBSITE: www.21frames.in...
FACEBOOK - / homecookingtelugu
KZitem: / homecookingtelugu
INSTAGRAM - / homecookingshow
A Ventuno Production : www.ventunotech...
Негізгі бет మెంతికూర పులావ్ | Methi Pulao | Methi Rice | Authentic Methi Pulao Recipe
Пікірлер: 33