అజగవ సాహితీ ఛానల్‌కు స్వాగతం. మన తెలుగు నేలపై ఎందరో మహా పండితులు, మహా మహా విద్యావేత్తలు పుట్టారు. అటువంటివారిలో శ్రీ పిడపర్తి పెద్ద దక్షిణామూర్తిశాస్త్రి గారు ఒకరు. ఆయన గొప్ప జ్యోతిష పండితుడు. మహా పంచాగవేత్త. కళ్ళు మూసుకుని, వేళ్లపై గణితం లెక్క వేసుకుంటూ ముహూర్తం పెడతారు. ఆయన నోటి నుండి ఇదీ ముహూర్తం అని ఒక మాట వస్తే ఇక దానికి తిరుగులేదని అర్థం. శాస్త్రిగారు ప్రశ్నాశాస్త్రంలో కూడా ఉద్దండులు. ఉద్యోగం, వ్యాపారం, వివాహం, వ్యవహారం ఇలా ఏ విషయానికి సంబంధించిన ప్రశ్నలడిగినా ఆయన వేళ్ళపైనే లెక్కలు వేసి సమాధానం కాగితంపై వ్రాసిస్తారు. ఆయన రాసిన ఆ రాత ఇక బ్రహ్మరాతతో సమానం. అంతటి ఆ మహాపండితుని పరీక్షించబోయి తెల్లబోయాడో ఇంగ్లీషు న్యాయమూర్తి. ఈ జరిగినకథ వయస్సు సుమారు 150 సంవత్సరాల పైమాటే. ఆ ఉదంతాన్ని ఈరోజు చెప్పుకుందాం.
#indianastrology #jyotish #Pidaparthi
Негізгі бет Ойын-сауық తెలుగువారిలో గొప్ప జ్యోతిష్కులు | పిడపర్తి | ప్రశ్నాశాస్త్రం | Indian Astrology | Rajan PTSK
Пікірлер: 155